అనూహ్యం... కత్తి మహేష్ కు మద్దతుగా పూనం కౌర్ ట్వీట్!
- నిన్న కత్తి మహేష్ తల్లిని ప్రస్తావించిన ఓ టీవీ చానల్
- ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లిపోయిన కత్తి
- ఆపై ఆయన తల్లిపై వెల్లువెత్తిన ట్వీట్లు
- ఎవరైనా ఎవరి తల్లినీ కించపరచవద్దన్న పూనం కౌర్
ఎవరైనా ఓ వ్యక్తి తల్లిని కించపరుస్తూ మాట్లాడకూడదని వ్యాఖ్యానించింది. దయచేసి కత్తి మహేష్ తల్లిని గురించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. నిన్నటి టీవీ చానల్ ఇంటర్వ్యూ తరువాత కత్తి మహేష్ తల్లిపై ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తగా, పూనం కౌర్ హుందాగా స్పందించడం గమనార్హం.