నెత్తురోడిన తెలంగాణ రోడ్డు... ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి
- గద్వాల సమీపంలో ప్రమాదం
- మరో 25 మందికి గాయాలు
- అందరూ కూలీలే
- సంక్రాంతికి ఇళ్లకు వెళుతుండగా ఘోరం
వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా గద్వాలలోని జిన్నింగ్ మిల్లులో పనిచేసే కూలీలని, సంక్రాంతి పండగ కోసం స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. అతి వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కూడా కారణాలని తెలిపారు.