లేటు వయసులో రహస్య వివాహం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేటు వయసులో రహస్య వివాహం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్?

  • మూడో వివాహం చేసుకున్న ఇమ్రాన్
  • జనవరి 1 రాత్రి వివాహం
  • పెళ్లి కుమార్తెకు ఇప్పటికే పెళ్లయింది
పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. 65 ఏళ్ల ఇమ్రాన్ ఖార్ జనవరి 1వ తేదీ రాత్రి లాహార్ లోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ సెక్టార్-వైలో ఉన్న తన నివాసంలోనే పెళ్లి చేసుకున్నారని పేర్కొంది. తనకు ఆధ్యాత్మిక అంశాల్లో సలహాదారుగా ఉన్న ఓ మహిళను ఆయన వివాహం చేసుకున్నారని చెప్పింది. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందని ఓ నేతకు ఆమె మంచి స్నేహితురాలని పేర్కొంది. లాహోర్ లోని గుల్బెర్గ్ ప్రాంతంలో ఆమె ఉంటారని తెలిపింది. రెండేళ్ల క్రితం వీరిద్దరికీ పరిచయం అయిందని... అప్పటి నుంచి ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి ఆమెను ఇమ్రాన్ కలుస్తూ ఉండేవారని చెప్పింది.

ఇమ్రాన్ కొత్త భార్యకు గతంలోనే ఓ ప్రభుత్వ అధికారితో వివాహం అయిందని... విడాకుల కోసం కొన్ని నెలల క్రితమే ఆమె పిటిషన్ వేశారని సదరు పత్రిక తెలిపింది. వీరి నిఖాను తెహ్రీక్ పార్టీ కోర్ సభ్యుడైన ముఫ్తీ సయీద్ నిర్వహించారని పేర్కొంది. మరోవైపు ఈ వార్తలను ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఖండించారు. ఇది ముమ్మాటికీ ఎల్లో జర్నలిజమే అని మండిపడ్డారు. 
imran khan
imran khan marriage

More Telugu News