manchu vishnu: ''నేనేదనుకుంటే అది చెప్పడం నాకలవాటు'' అంటూ 'గాయత్రి' నుంచి కొత్త పోస్టర్

షార్ట్స్‌లో చూడండి
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు 'గాయత్రి' సినిమాలో నటిస్తూ దానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ వదిలిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. గృహిణిగా .. అందంగా .. ఆకర్షణీయంగా ఈ పోస్టర్ లో శ్రియ కనిపిస్తోంది.

"నేనేదనుకుంటే అది చెప్పడం నా కలవాటు .. తరువాత సంగతి తరువాత" అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై కనిపిస్తూ, శ్రియ పాత్ర స్వభావాన్ని తెలుపుతోంది. స్థిరమైన ఆలోచనా విధానం .. ధైర్యంతో కూడుకున్న నిర్ణయం .. అవసరమైన తెగింపు ఈ పాత్ర స్వభావమని ఈ క్యాప్షన్ ను బట్టి అర్థమవుతోంది. విష్ణు భార్యగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. నిఖిలా విమల్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.    
Go Back to Shorts
manchu vishnu
shriya

More Telugu News