purandheswari: టీడీపీ వైఖరి మార్చుకోకపోతే.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: పురంధేశ్వరి

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. పరిపాలన విషయంలో తప్పులు చేస్తున్న టీడీపీ... ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు 80 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని... అయినా, ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందించడం లేదని ఆమె అన్నారు.

నిధుల కేటాయింపులకు సంబంధించి అనేక ఆరోపణలు తమ వరకు వచ్చాయని చెప్పారు. మిత్రపక్షమైన టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ పోతే.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ సామర్థ్యాన్ని బట్టి బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డంకిగా మారాయని చెప్పారు. 
Go Back to Shorts
purandheswari
Telugudesam
BJP

More Telugu News