ms subbulakshmi: ఎంఎస్ సుబ్బులక్ష్మి కుమార్తె రాధా విశ్వనాథన్ మృతి

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి, దివంగత ఎంఎస్ సుబ్బులక్ష్మి కుమార్తె రాధా విశ్వనాథన్ (83) కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు శ్రీనివాసన్ తెలిపారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్న ఆమెను బెంగళూరులోని ఫోర్టిన్ ఆసుపత్రిలో నిన్న చేర్చామని, గత అర్ధరాత్రి కన్నుమూశారని చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజగోవిందంలో సుబ్బులక్ష్మి గొంతుతో పాటు తన తల్లి స్వరం కూడా వినిపిస్తుందని ఆయన గుర్తుచేసుకున్నారు. రాధా విశ్వనాథన్ కు కుమారులు చంద్రశేఖర్, శ్రీనివాసన్, కుమార్తె శుభలక్ష్మి ఉన్నారు. కాగా, తన తల్లితో పాటు దేశవిదేశాల్లో ఎన్నో కచేరీల్లో రాధా విశ్వనాథన్ పాల్గొన్నారు.
Go Back to Shorts
ms subbulakshmi
radha viswanadhan

More Telugu News