35 ఏళ్ల తర్వాత సౌదీలో సినిమాలు.. తొలి భారతీయ చిత్రం రజనీదే!
- 1980లలో థియేటర్లను మూసేసిన సౌదీ
- ప్రస్తుతం ఒక్క థియేటర్ మాత్రమే ఉంది
- ఇప్పుడు మళ్లీ థియేటర్ల ప్రాంరంభం
ఈ నేపథ్యంలో, దాదాపు 35 ఏళ్ల తర్వాత థియేటర్లను మళ్లీ ప్రారంభించేందుకు సౌదీ కార్యాచరణ మొదలుపెట్టింది. మార్చిలో తొలి థియేటర్ ప్రారంభం కానుందని సౌదీ మంత్రి ఒకరు చెప్పారు. అక్కడ థియేటర్లు ప్రారంభమయిన తర్వాత విడుదలయ్యే తొలి సినిమా ఇండియాదే కావడం గమనార్హం. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' కావడం విశేషం.