aimplb: ట్రిపుల్ తలాక్ ర‌ద్దు నేప‌థ్యంలో స్టాలిన్‌ను క‌లిసిన అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు!

షార్ట్స్‌లో చూడండి
ముస్లిం మ‌హిళ‌ల జీవితాలను నాశనం చేస్తోన్న ట్రిపుల్‌ తలాక్ విధానం నిషేధపు బిల్లును ఇటీవల లోక్‌స‌భ‌ ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుపై త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష డీఎంకే నేత స్టాలిన్ తాజాగా మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తొందరపాటుతో వ్యవహరించిందని, దీన్ని స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్టాలిన్‌ను క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపింది. సజ్జద్‌ నొమానీ ఆధ్వ‌ర్యంలో ఏఐఎంపీఎల్‌బీ కార్యవర్గ సభ్యులు స్టాలిన్‌ నివాసానికి వ‌చ్చి కాసేపు మాట్లాడారు. 
Go Back to Shorts
aimplb
stalin
talaq

More Telugu News