కర్నూలు జిల్లాలో ఎస్సీలు ఉండే కాలనీకి తాగునీరు కట్.. దళితులతో మాట్లాడితే రూ.5 వేలు జరిమానా!
- కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామంలో ఘటన
- ఖననానికి గొయ్యి తవ్వలేదని వెలివేత
- పోలీసులను ఆశ్రయించిన దళితులు
గొయ్యి తవ్వేవారు ఇద్దరే ఉండడంతో గుంత తవ్వలేమని ఇద్దరు వ్యక్తులు బాల తిమ్మయ్య (90) కుటుంబ సభ్యులకు చెప్పారని, దీంతో తమను బహిష్కరించారని, పర్యవసానంగా సుమారు 20 కుటుంబాలకు నీళ్లు, సరుకులు అందక బాధపడుతున్నారని దళితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.