vikram: విక్రమ్ .. తమన్నా మూవీ ఆగలేదు .. వస్తోందట!

  • విక్రమ్ హీరోగా 'స్కెచ్'
  • తమిళంలో సంక్రాంతికి విడుదల 
  • తెలుగులో జనవరి 26న

తమిళంలో విక్రమ్ .. తమన్నా జంటగా 'స్కెచ్' సినిమా తెరకెక్కింది. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. అయితే డిస్ట్రిబ్యూషన్ పరంగా వున్న సమస్యల కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

 ఈ విషయం పట్ల ఈ సినిమా నిర్మాతలు స్పందిస్తూ, జరుగుతోన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని అన్నారు. తెలుగులోను ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ గట్టిపోటీ ఉండటంతో, ఆ ఆలోచనను విరమించుకున్నారు. తెలుగులో ఈ సినిమాను నిర్మాత సురేశ్ బాబు సమర్పిస్తుండగా, జనవరి 26వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.   

More Telugu News