'హలో' హిట్ కొట్టాలంటే ఇంకా అంత రాబట్టాలట!
- తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లు రాబట్టిన 'హలో
- 'ప్రపంచవ్యాప్తంగా 15.7 కోట్ల వసూళ్లు
- ఈ వీకెండ్ లో మరిన్ని వసూళ్లు సాధించే ఛాన్స్
ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో వచ్చినట్లయితే .. ఈ ఫిగర్ మరింత పెరిగేది. ఈ సినిమా ఇంకా 16 కోట్ల వరకూ రాబడితే అప్పుడు హిట్ కేటగిరీలోకి వెళుతుందని అంటున్నారు. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు గనుక, ఈ వీకెండ్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా కారణంగా కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ కు వరుస అవకాశాలు వస్తున్నాయట. తన తదుపరి సినిమా వివరాలను వచ్చేనెల 10వ తేదీన చెబుతానని అఖిల్ అనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.