నా ఓటు టీడీపీకా, వైసీపీకా అనేది చెప్పలేను.. కారణం ఇదే: కేటీఆర్
- ఫిట్ గా ఉండాలనేదే నా కొత్త సంవత్సర తీర్మానం
- అమెరికాలో వంట చేసుకునేవాడిని
- బరాక్ ఒబామా నాకు చాలా ఇష్టం
క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లను ఇష్టపడతానని తెలిపారు. తన అభిమాన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అని చెప్పారు. అమెరికాలో ఉన్నప్పుడు సొంతంగా వంట చేసుకునేవాడినని తెలిపారు. ఇండియన్, చైనీస్ వంటకాలు తనకు ఇష్టమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తన సోదర రాష్ట్రమని అన్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా... తనకు ఏపీలో ఓటు లేదని, అందువల్ల తన ఓటు టీడీపీకా లేక వైసీపీకా? అనే విషయాన్ని చెప్పలేనని సమాధానమిచ్చారు.