mithali raj: మిథాలీ రాజ్‌కు ఇంటి స్థలం పత్రాలు అందించిన తెలంగాణ మంత్రి

షార్ట్స్‌లో చూడండి
భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌కు హైద‌రాబాద్‌లో 600 గ‌జాల‌ ఇంటి స్థ‌లం ఇస్తామ‌ని గతంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఈ రోజు ఆమెకు ఆ న‌జ‌రానా అందింది. హైద‌రాబాద్‌లోని తెలంగాణ స‌చివాలయంలో మిథాలీరాజ్‌కు మంత్రి ప‌ద్మారావు ఇంటి స్థ‌లం ప‌త్రాలు అంద‌జేశారు.

అలాగే, మిథాలీ రాజ్ కోచ్ మూర్తికి రూ.25 ల‌క్ష‌ల చెక్ అందించి అభినందించారు‌. ఈ సంద‌ర్భంగా మిథాలిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వ ప్రోత్సాహానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. క్రీడాకారుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తోంద‌ని కొనియాడింది.
Go Back to Shorts
mithali raj
land dacuments
telangana

More Telugu News