ఆలస్యంగా నిద్రలేచిన భార్య.. తలాక్ చెప్పి ఇంట్లోంచి గెంటేసిన భర్త
- ఉత్తరప్రదేశ్, రాంపూర్‌లో ఘటన
- రాత్రిపూట మద్యం తాగి వచ్చి భర్త కొట్టాడని మహిళ ఫిర్యాదు
- అందుకే ఒంటి నొప్పులతో కొద్దిసేపు ఎక్కువగా పడుకున్నానని వివరణ
దీంతో ఆ ముస్లిం మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపి విలపించింది. తన భర్త మద్యం తాగి వచ్చి రాత్రి తనను కొట్టాడని, దీంతో ఒంటి నొప్పులతో బాధపడుతూ కాస్త అధికంగా నిద్రపోయానని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తలాక్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించినప్పటికీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం గమనార్హం.