pavan kalyan: 'అజ్ఞాతవాసి' సెన్సార్ ఒక రోజు ఆలస్యంగా!

  • ఈ నెల 30న 'అజ్ఞాతవాసి' సెన్సార్
  • వచ్చే నెల 10న భారీ విడుదల 
  • పవన్ కెరియర్లో 25వ సినిమా 
  • త్రివిక్రమ్ తో 3వ సినిమా  
పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అజ్ఞాతవాసి' సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది. ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే సమయం కోసం వాళ్లంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ .. పాటలు అనూహ్యమైన స్థాయిలో ఆకట్టుకోవడమే అందుకు కారణం.

 జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లాల్సి వుంది. అయితే కొన్ని కారణాల వలన మరుసటి రోజుకు వాయిదాపడి, ఈ నెల 30వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని చెబుతున్నారు.

పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, సీనియర్ కథానాయికలు ఖుష్బూ .. ఇంద్రజ కీలకమైన పాత్రలను పోషించారు. పవన్ కల్యాణ్ కి ఇది 25వ సినిమా కావడం .. త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమా కావడంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.      
pavan kalyan
keerthi suresh

More Telugu News