Telugudesam: రాష్ట్రంలో వైసీపీ దివాళ తీసింది: మంత్రి దేవినేని

షార్ట్స్‌లో చూడండి
 ఏపీలో వైసీపీ దివాళ తీసిందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీకి అధికారం దక్కలేదన్న బాధతో సీఎం చంద్రబాబునాయుడిపై జగన్ విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో కాకుండా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) డైరెక్షన్ లో జగన్ ముందుకు వెళుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను దేవినేని ప్రస్తావించారు. జవనరి 2వ తేదీ నుంచి ‘జన్మభూమి’, ‘మా ఊరు’, ‘ఇంటింటికి టీడీపీ’లో అందిన అర్జీలను పరిష్కరించనున్నట్టు దేవినేని చెప్పారు.
Go Back to Shorts
Telugudesam
devineni

More Telugu News