'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'గా అనుష్కశర్మ పెళ్లి ట్వీట్!
- వెల్లడించిన ట్విట్టర్ ఇండియా
- ఎక్కువగా ప్రస్తావించిన హీరోగా షారుక్
- హీరోయిన్ దీపికా పదుకునే
ఈ నివేదిక ప్రకారం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ గురించి ఎక్కువ మంది తమ ట్వీట్లలో ప్రస్తావించారని పేర్కొంది. అలాగే తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్‌లు ఉన్నట్లుగా తెలిపింది. ఇక హీరోయిన్లలో దీపికా పదుకునే గురించి ఎక్కువ మంది ప్రస్తావించారని, ఆమె తర్వాతి స్థానాల్లో ఆలియాభట్, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, భూమీ ఫడ్నేకర్‌లు ఉన్నట్లుగా పేర్కొంది. ఎక్కువగా ప్రస్తావించిన సినిమాలుగా షారుక్ ఖాన్ 'రాయిస్', సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై', 'ట్యూబ్‌లైట్', అక్షయ్ కుమార్ 'టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రాలు నిలిచాయి.