Revanth Reddy: రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఫౌండర్స్ ఫోరం ఫిర్యాదు.. కేసు నమోదు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. రేవంత్ రెడ్డిపై చర్యలు చేపట్టాలంటూ టీఆర్ఎస్ ఫౌండర్స్ ఫోరం నేతలు మహబూబ్ నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ప్రయోగించిన పదజాలం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయిందని, ‘కాంగ్రెస్’ లోకి కొత్త జోకర్ వచ్చాడని రేవంత్ ను ఉద్దేశించి మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు విదితమే. ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ, లక్ష్మారెడ్డి తన నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనని,లక్ష్మారెడ్డి డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఒరిజినల్‌దేనా? అంటూ రేవంత్ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. 
Go Back to Shorts
Revanth Reddy
telangana

More Telugu News