Puneet Rajkumar: కన్నడ పవర్ స్టార్ సినిమా 'అంజనీపుత్ర'పై కోర్టు కీలక నిర్ణయం... సినిమా ప్రదర్శన నిలపాలని ఆదేశం

షార్ట్స్‌లో చూడండి
కన్నడ నాట ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిత్రం 'అంజనీపుత్ర' ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో న్యాయవాదులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఓ లాయర్ కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని న్యాయవాదులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, సన్నివేశాలను తీసేసే వరకూ చిత్రంపై నిషేధాన్ని విధించాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన బెంగళూరు సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి, జనవరి 2 వరకూ సినిమా ప్రదర్శన నిలిపేయాలని, ఈలోగా లాయర్లను, న్యాయ వ్యవస్థను కించపరిచే డైలాగులను తొలగించాలని పేర్కొంది.
Go Back to Shorts
Puneet Rajkumar
Anjaniputra
Karnataka

More Telugu News