హైదరాబాద్‌లో మరో నకిలీ బాబా.. భక్తులకు తెలియకుండా బంగారాన్ని కాజేసి ఇల్లు కట్టుకున్న వైనం!
- నిందితుడి నుంచి 1.07 కిలోల ఆభరణాలు, రూ.3.05 లక్షలు స్వాధీనం
- టోలీచౌకిలోని ఇంట్లో ఆరేళ్లుగా పూజలు నిర్వహిస్తోన్న ఇస్మాయిల్
- దీర్ఘకాలిక రోగాలను ఒకే ఒక్క పూజతో నయం చేస్తానని మోసాలు
- డబ్బు, బంగారానికి పూజలు చేస్తే రోగాలు నయమవుతాయని చెబుతోన్న మోసగాడు
డబ్బు, బంగారానికి పూజలు చేస్తే రోగాలు నయమవుతాయని చెబుతున్నాడు. భక్తులు ఆ బాబా చెప్పినట్లే డబ్బు, బంగారంతో వచ్చి వాటికి పూజలు చేయించుకుంటున్నారు. అదే సమయంలో ఇతరుల సాయంతో బాబా వాటిని కాజేస్తున్నాడు. ఎట్టకేలకు ఆ బాబా మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాజేసిన బంగారాన్ని తాకట్టుపెట్టి ఆ బాబా ఇల్లు నిర్మించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.