విద్యార్థులకు 'ఆగ్జిలో' బంపర్ ఆఫర్.. రూ.35 లక్షల వరకూ హామీ లేకుండా విద్యారుణాలు!
- హైదరాబాదులో ఆగ్జిలో కార్యకలాపాలు ప్రారంభం
- దేశవ్యాప్తంగా ఏడాదిలో రూ. 350 కోట్ల రుణాలు లక్ష్యం
- వడ్డీ రేటు 10 నుంచి 13 శాతం
చదువులో మంచి ప్రతిభ కనబరిచి, మంచి ఉద్యోగావకాశాలున్న కోర్సులు చేసే విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. కొన్ని నిబంధనలకు లోబడి రూ. 35 లక్షల వరకు ఎలాంటి హామీలు లేకుండానే రుణాలను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వడ్డీ రేటు 10 నుంచి 13 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఇతర సంస్థల నుంచి తీసుకున్న విద్యా రుణాలను కూడా తమ వద్దకు బదిలీ చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.