Virat Kohli: నోట్లో కరెన్సీ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్న అనుష్క శర్మ... వైరల్ అయిన వీడియోపై విమర్శలు!

షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మల వివాహం అనంతరం, నిన్న రాత్రి న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో రిసెప్షన్ జరిగిన వేళ, తీసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. నోటితో కరెన్సీని పట్టుకుని అనుష్క డ్యాన్స్ చేస్తున్న దృశ్యం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. వీరి రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా, డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ తదితర ప్రముఖులు వచ్చి అభినందనలు తెలిపారు. పంజాబీ మ్యూజిక్ వినిపిస్తుండగా, డ్యాన్స్ చేసిన అనుష్క, తన నోటితో కరెన్సీని పట్టుకోవడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుష్క డ్యాన్స్ వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Virat Kohli
Anushka Sharma
Narendra Modi
Reception

More Telugu News