విరుష్క రిసెప్ష‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ... వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరుష్క రిసెప్ష‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ... వీడియో ఇదిగో!

  • బ‌హుమ‌తిగా రెండు గులాబీలు
  • మోదీని ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన విరుష్క‌
  • ఢిల్లీలో ఘ‌నంగా జ‌రిగిన రిసెప్ష‌న్‌
క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, న‌టి అనుష్క శ‌ర్మ‌ల వివాహానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హాజ‌రై, వారికి అభినంద‌న‌లు తెలిపారు. అలాగే రెండు గులాబీల‌ను కొత్త జంట‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఢిల్లీలో జ‌రిగే రిసెప్ష‌న్‌కి రావాల‌ని కోరుతూ అనుష్క‌, విరాట్‌లు ప్ర‌ధాని మోదీని ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో క్రికెటర్లు యువ‌రాజ్ సింగ్‌, ఇషాంత్ శ‌ర్మ‌లు కూడా మోదీని త‌మ రిసెప్ష‌న్ వేడుక‌ల‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. కానీ ప్ర‌ధాని మోదీ హాజ‌రుకాలేదు. కానీ విరుష్క రిసెప్ష‌న్‌కి ప్ర‌ధాని హాజ‌రుకావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ రిసెప్ష‌న్‌కి ఢిల్లీలో ఉండే క్రికెట‌ర్లు సురేశ్ రైనా, గౌత‌మ్ గంభీర్‌, శిఖ‌ర్ ధావ‌న్‌లు కుటుంబ స‌మేతంగా హాజ‌ర‌య్యారు. అలాగే విరుష్క కుటుంబీకులు, ఇత‌ర రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ రిసెప్ష‌న్‌కి హాజ‌ర‌య్యారు.
virushka
Virat Kohli
Anushka Sharma
reception
Narendra Modi

More Telugu News