ఆవిష్కరించిన కాసేపట్లోనే ఆగిపోయిన జియో టీవీ వెబ్ వెర్షన్
- సాంకేతిక లోపాలే కారణం
- 'అండర్ కన్‌స్ట్రక్షన్' మెసేజ్ చూపిస్తున్న సైట్
- సర్వీసుల పునరుద్ధరణకు సంవత్సరం పట్టే అవకాశం?
జియో టీవీ వెబ్ వెర్షన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించి, తిరిగి టీవీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి దాదాపు సంవత్సరకాలం పట్టే అవకాశం ఉందని జియో సాంకేతిక వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ వెబ్‌సైట్‌తో పాటు ఆవిష్కరించిన జియోసినిమా వెబ్‌సైట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పనిచేస్తోంది. ఈ వెబ్‌సైట్ ద్వారా టీవీ షోలు, సినిమాలు చూసుకోవచ్చు. అందుకోసం జియో నెంబర్‌తో గానీ, జియో ఐడీతో గానీ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.