ట్వీట్లలో అసభ్య పదజాలంపై ట్విట్టర్ వేటు... ఇవాళ్టి నుంచి అమలు
- కొత్త కంటెంట్ పాలసీ విధానాలు రూపొందించిన సంస్థ
- నియమాలు ఉల్లంఘిస్తే ప్రతిచర్యలు
- ఖాతాను నిలిపివేయడం, తొలగించడం జరిగే అవకాశం
ఈ మార్పుల ప్రకారం ట్వీట్‌లోగానీ, ప్రొఫైల్‌లో గానీ అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన వారిపై ట్విట్టర్ చర్యలు తీసుకోనుంది. అంటే ఇలాంటి ఇబ్బందికర మెసేజ్‌లను ట్వీట్ చేసిన వారి ఖాతాను నిలిపివేయడం గానీ, తొలగించడం గానీ చేయనుంది. రక్తపాతం, విధ్వంసాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ట్వీట్ చేసే వారిపై కూడా ఈ చర్యలు తీసుకోనుంది.