కేటీఆర్ సార్, మీరు మాకు గర్వకారణం: కేటీఆర్ పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు
- కేటీఆర్ పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు
- ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్ష
- ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
తెలుగువారందరికీ గర్వకారణమని మంచు విష్ణు ట్వీట్ చేయగా... కేటీఆర్ థ్యాంక్స్ చెబుతూ, ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఓ షూటింగ్ సందర్భంగా మంచు విష్ణు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విష్ణు ఆరోగ్యం గురించి కేటీఆర్ స్పందించారు. ఇంకా సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, అనిల్ రావిపూడి, కోన వెంకట్ లు కూడా కేటీఆర్ ను అభినందించారు. వీరందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.