రూ. 2000లోపు డెబిట్ కార్డు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ లేదు... వెల్లడించిన కేంద్రం
- జనవరి 1 నుంచి అమలు
- నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నం
- రెండేళ్ల వరకు ఎండీఆర్ ఛార్జీలు భరించనున్న ప్రభుత్వం
ఇప్పటి వరకు రూ. 1000లోపు లావాదేవీలకు 0.25 శాతం, రూ. 1000 నుంచి రూ. 2000 మధ్య లావాదేవీలకు 0.5 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ అదనపు ఛార్జీని ప్రభుత్వం భరించనుంది. రెండేళ్ల వరకు ఈ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుంది. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి దాదాపు రూ. 2,500 కోట్లు ఎండీఆర్ ఛార్జీల కింద బ్యాంకులకు చెల్లించనుంది.