అందుకే నేను నెలకి ఒక్కసారైనా తెలుగు రాష్ట్రాలకు వస్తుంటాను: వెంకయ్య నాయుడు
- పదవిని స్వీకరించిన తరువాత కూడా తెలుగు వారికి దూరం కాలేదు
- తెలంగాణలో, ఆంధ్రలో అడుగుపెట్టకపోతే నాకు ఏదో కోల్పోయినట్లు ఉంటుంది
- ఈ మాటను నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా చెబుతున్నాను
'ఉప రాష్ట్రపతిగా పదవిని స్వీకరించిన తరువాత కూడా నేను తెలుగు వారికి దూరం కాలేదు. ఎందుకో నెలకొక్కసారైనా నేను పెరిగిన తెలంగాణలో, నేను పుట్టిన ఆంధ్రలో అడుగుపెట్టకపోతే తెలుగు నేలను తాకకపోతే నాకు ఏదో కోల్పోయినట్లు ఉంటుందని నేను నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా చెబుతున్నా' అని వెంకయ్య నాయుడు అన్నారు.