అలనాటి బాలీవుడ్ తార మీనా కుమారి పాత్ర‌లో స‌న్నీలియోన్‌!
Add ap7am to your home Screen

అలనాటి బాలీవుడ్ తార మీనా కుమారి పాత్ర‌లో స‌న్నీలియోన్‌!

  • కరణ్‌ రాజ్దాన్ దర్శకత్వంలో చిత్రం
  • మొద‌ట విద్యాబాల‌న్‌ను తీసుకున్న సినిమా బృందం
  • విద్యాబాల‌న్ త‌ప్పుకోవ‌డంతో స‌న్నీకి ఛాన్స్
  • మ‌ద్యానికి బానిసై మృతి చెందిన విష‌యం చూపిస్తాం-ద‌ర్శ‌కుడు
అలనాటి బాలీవుడ్‌ తార మీనా కుమారి పాత్రలో సన్నీలియోన్ కనపడనుంది. కరణ్‌ రాజ్దాన్ దర్శకత్వంలో మీనా కుమారి జీవితం ఆధారంగా బాలీవుడ్ లో రాబోతున్న ఈ సినిమాలో మొదట్లో విద్యా బాలన్‌ను తీసుకున్నారు. అయితే, ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ఈ పాత్ర‌కు సన్నీ లియోన్ ని ఎంపిక చేశారు.
 
ఈ సినిమా కథ విన్న వెంటనే స‌న్నీలియోన్ ఓకే చెప్పేసింద‌ని ఆ సినిమా బృందం తెలిపింది. ఈ సినిమా దర్శకుడు కరణ్‌ రాజ్దాన్ తాజాగా మాట్లాడుతూ...  స‌న్నీ లియోన్‌కు అర్థమయ్యేలా తాను స్క్రిప్ట్‌ వివరించాన‌ని అన్నారు. మొద‌ట‌ ఈ పాత్రకు సన్నీని తీసుకోవాలని అనుకోలేదని, క‌థ చెప్ప‌గానే సన్నీలియోన్‌ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు క‌నిపించింద‌ని తెలిపారు. అల‌నాటి న‌టి మీనాకుమారి మ‌ద్యానికి బానిసై మృతి చెందిన విష‌యాన్ని తాము చూపిస్తామ‌ని చెప్పారు. 
Sunny Leone
cinema
Bollywood

More Telugu News