అమ్మాయిలకు సల్మాన్ ఖాన్ సలహా
- అమ్మాయిల రక్షణ కోసం హిమ్మత్ యాప్
- అందుబాటులోకి తెచ్చిన ఢిల్లీ పోలీసులు
- అందరూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్న సల్మాన్
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, హిమ్మత్ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని... ఆకతాయిల నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చాడు. పోలీస్ కమిషనర్ సంజయ్ బేనివాల్ మాట్లాడుతూ, రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. పోలీసు కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు సల్మాన్ తో పాటు అలియా భట్, షబానా అజ్మీ, కరీనా కపూర్, విద్యాబాలన్, ఇర్ఫాన్ ఖాన్ లు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.