సావిత్రి పాత్రకు ముందుగా సమంతనే తీసుకున్నాం: స్వప్న దత్
- 'మహానటి' నిర్మాతగా స్వప్న దత్
- కీర్తి సురేశ్ ను ముందుగా అనుకోలేదు
- అప్పటికి ఆమె పాప్యులర్ కాదు
- తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో రిలీజ్
"ఆ తరువాత .. సావిత్రి పాత్రను కొత్త అమ్మాయితో చేయిస్తే బాగుంటుందని భావించి కీర్తి సురేశ్ ను తీసుకున్నాం. ఈ సినిమాకి ఓకే చెప్పిన తరువాతనే కీర్తి సురేశ్ పాప్యులర్ కావడం జరిగింది. సావిత్రి జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆమె కూతురు విజయ చాముండేశ్వరి దగ్గర నుంచి సేకరించాం. ఎంతో అరుదైన ఫోటోలను కూడా ఆమె మాకు అందించారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం" అని ఆమె చెప్పుకొచ్చారు.