ఏయూలో త‌న స్నేహితుల‌ని క‌లిసిన వెంక‌య్య నాయుడు!

  • ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
  • హాజ‌రైన వెంక‌య్య నాయుడు, గంటా శ్రీనివాసరావు
  • త‌మ‌ మిత్రుల‌తో స‌ర‌దా‌గా గ‌డుపుతోన్న పూర్వ విద్యార్థులు
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోంది. ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఈ స‌మావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స‌హా పలువురు పూర్వ విద్యార్థులు భారీగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తరగతి గదిలో స్నేహితులతో వెంకయ్య నాయుడు కాసేపు స‌ర‌దాగా గడిపారు. కాలేజీ మిత్రుల‌తో గడపడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పూర్వ విద్యార్థులు త‌మ స్నేహితుల‌ను క‌లిసి ఫొటోలు తీసుకుంటూ స‌ర‌దాగా గడుపుతున్నారు.    
Go Back to Shorts
au
Venkaiah Naidu
ganta srinivasa rao

More Telugu News