గుజ‌రాత్‌లో ఓటు వేయ‌డానికి విచ్చేసిన పెళ్లి జంటలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజ‌రాత్‌లో ఓటు వేయ‌డానికి విచ్చేసిన పెళ్లి జంటలు!

  • ముఖానికి ప‌సుపుతో ఒక‌రు
  • పెళ్లి బ‌ట్ట‌ల‌తో మ‌రొక‌రు
  • వైర‌ల్ అవుతున్న ఫొటోలు
గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న మొద‌టి ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి పెళ్లి జంట‌లు విచ్చేశాయి. సూర‌త్‌లో క‌తార్గాం పోలింగ్ కేంద్రంలో ముఖానికి ప‌సుపుతో ఫెన్నీ ఫ‌రేఖ్ అనే మ‌హిళ ఓటు వేయ‌డానికి వ‌చ్చింది. అలాగే భ‌రూచ్ పోలింగ్ కేంద్రంలో ఇవాళ పెళ్లి చేసుకుంటున్న ఓ జంట పెళ్లి బ‌ట్ట‌ల‌తో హాజ‌రై త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే రాజ్‌కోట్‌లోని ధార‌ళా గ్రామంలో మ‌మ‌తా గొండాలియా అనే యువ‌తి పెళ్లి కూతురిగా వ‌చ్చి ఓటు వేసింది.

వీరి ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. కొంత‌మంది ప్రజాస్వామ్యం పట్ల వీరికున్న బాధ్య‌త‌ను పొగిడేస్తుంటే... మ‌రికొంత మంది మాత్రం ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించ‌డానికి ఈ ప్ర‌య‌త్నం అంటూ పెద‌వి విరుస్తున్నారు.
  
gujarat
elections
newly weds
twitter

More Telugu News