హానీమూన్‌లో జ‌హీర్‌ ఫొటోలు షేర్ చేసిన సాగ‌రిక ఘ‌ట్గే... ఆట‌ప‌ట్టించిన సానియా మీర్జా

  • మాల్దీవుల్లో ఉన్న జ‌హీర్ - సాగ‌రిక‌
  • జ‌హీర్ ఫొటో మాత్ర‌మే షేర్ చేసిన సాగ‌రిక‌
  • హ‌నీమూన్ ఒక్క‌డే చేసుకుంటున్నాడా? అన్న సానియా
ఇటీవ‌ల ఒక్క‌టైన క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ - న‌టి సాగ‌రిక ఘ‌ట్గేల జంట వారి హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కు వెళ్లింది. అక్క‌డ వారి హోట‌ల్‌, చుట్టు ప‌క్క‌ల ప్ర‌కృతి అందాల‌ను ఫొటో తీసి సాగ‌రిక త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేస్తోంది. వాటిలో ఒక ఫొటోలో జ‌హీర్ ఒంట‌రిగా ప‌డుకుని స‌ముద్ర అందాలు చూస్తున్న‌ట్లు ఉంది. అయితే ఈ ఫొటోకు సానియా మీర్జా చేసిన కామెంట్ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. 'చూడ‌బోతే హ‌నీమూన్ జ‌హీర్ ఒంట‌రిగా చేసుకుంటున్న‌ట్లు ఉంది' అంటూ టెన్నిస్ తార కామెంట్ చేసింది.
Go Back to Shorts
zahir khan
sagarika ghatke
sania mirza
instagram

More Telugu News