ఇంగ్లిష్ దినపత్రికపై మండిపడ్డ సినీనటుడు సిద్ధార్థ్!
- '2.ఓ' సినిమాలో సిద్ధార్థ్ హీరో అని పేర్కొన్న ఇండియా టుడే
- సిద్ధార్థ్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయిందని వార్త
- ఆయన ఖాతాలో తప్పుడు పోస్ట్‌లు వస్తున్నాయని ప్రచారం
ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్.. 2.ఓ సినిమాలో తాను హీరోనని ఆ పత్రిక పేర్కొనడం పట్ల చురకలంటించారు. భారత జర్నలిజం పీక్స్‌లో ఉందని, గర్వించదగిన సమయమని పేర్కొన్నాడు. 2.ఓ సినిమా తనది కాదని, అది ఓ లెజెండ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అని, అందులో పెద్ద హీరో నటిస్తున్నారని స్పష్టతనిచ్చారు. దీంతో ఇండియా టుడే తాము చేసిన తప్పుని సరిదిద్దుకుంది.