పాకిస్థాన్ అంటేనే చీదరించుకుంటోన్న 72 శాతం మంది భారతీయులు... సర్వేలో వెల్లడి
- వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే
- 2013లో 54 శాతం మందిలో పాక్ అంటే వ్యతిరేకత
- 2014లో 49 శాతం మందిలో
- ఇప్పుడు భారీగా పెరిగిన పాక్ వ్యతిరేకత
పాక్‌పై వ్యతిరేకత ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల్లో అధికంగా ఉంది. అలాగే పార్టీ పరంగా చూస్తే బీజేపీని అభిమానిస్తోన్న వారిలో 70 శాతం మంది, కాంగ్రెస్‌ను అనుసరిస్తోన్న వారిలో 63 శాతం మందికి ఆ దేశం అంటే వ్యతిరేకత ఉంది. కాగా, దేశంలోని 88 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారని ఇదే సర్వే ద్వారా తెలిసింది. పాక్‌తో ఆయన అనుసరిస్తోన్న వైఖరికి మాత్రం 21 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు.