twitter: ట్విట్ట‌ర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న భార‌తీయుల్లో ప్ర‌ధాని టాప్‌!

షార్ట్స్‌లో చూడండి
తాజాగా ట్విట్ట‌ర్ ఇండియా విడుద‌ల చేసిన జాబితాలో ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న భార‌తీయుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మొద‌టి స్థానంలో నిలిచారు. '#Thishappened' పేరుతో 2017లో ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్స్ గురించి ట్విట్ట‌ర్ ఇండియా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో 37.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్న న‌రేంద్ర‌మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అలాగే ఫాలోవ‌ర్ల‌లో టాప్ 10 జాబితాను పోస్ట్ చేసింది.

ఇందులో మోదీ త‌ర్వాతి స్థానాల్లో అమితాబ్‌, షారుక్‌, స‌ల్మాన్‌, అక్ష‌య్ కుమార్‌, ఆమిర్ ఖాన్‌, దీపికా ప‌దుకునే, సచిన్ టెండూల్క‌ర్‌, హృతిక్ రోష‌న్‌, విరాట్ కొహ్లీలు వ‌రుస‌గా నిలిచారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక మ‌హిళ‌, న‌టి దీపికా. అలాగే మోదీ, స‌చిన్‌, విరాట్ మిన‌హా మిగిలిన వాళ్లంతా సినీతార‌లే.
Go Back to Shorts
twitter
Narendra Modi
followers
Amitabh Bachchan
Shahrukh Khan
deepika padukone

More Telugu News