విచిత్రం! మూడు బంతుల్లోనే మొత్తం రివ్యూలను కోల్పోయిన ఆస్ట్రేలియా!
- యాషెస్ సిరీస్‌లో ఘటన
- మూడు బంతుల వ్యవధిలో రెండు రివ్యూలను కోల్పోయిన ఆసీస్
- క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి
జో రూట్ ఇచ్చిన క్యాచ్ బిహైండ్ విషయంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అప్పీల్‌ను న్యూజిలాండ్ అంపైర్ క్రిస్ గాఫెనీ తిరస్కరించడంతో స్మిత్ రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో అది ఔట్ కాదని తేలడంతో ఆసీస్ తొలి రివ్యూను కోల్పోయింది. మరో రెండు బంతుల తర్వాత డేవిడ్ మాలిన్ విషయంలో మరోసారి స్మిత్ రివ్యూ కోరగా అది కూడా ఔట్ కాదని తేలింది. దీంతో మూడు బంతుల వ్యవధిలోనే ఉన్న రెండు రివ్యూలను కోల్పోయింది.