చరణ్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరణ్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్?

  • అజ్ఞాతవాసి' చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ 
  • 'నా పేరు సూర్య'లోను తనే హీరోయిన్ 
  • బోయపాటి మూవీలోను ఛాన్స్ అంటూ టాక్    
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ 'రంగస్ధలం 1985' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చరణ్ .. బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి అందుకు సంబంధించిన పనుల్లోనే బిజీగా వున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రాశి ఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్ పేర్లను పరిశీలిస్తున్నారట. అనూ ఇమ్మాన్యుయేల్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఒక వైపున పవన్ కల్యాణ్ తో  'అజ్ఞాతవాసి' సినిమా చేసిన అనూ ఇమ్మాన్యుయేల్, మరో వైపున అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' సినిమా చేస్తోంది. బోయపాటి సినిమాలోను ఆమె ఓకే అయితే, పెద్దగా గ్యాప్ లేకుండా ముగ్గురు మెగా హీరోలతో చేసినట్టుగా అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు సంగతి అలా ఉంచితే, 'అజ్ఞాతవాసి' .. 'నా పేరు సూర్య' సినిమాలు తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతాయని అనూ ఇమ్మాన్యుయేల్ భావిస్తోంది. 
charan
rasi khanna
anu emmanuel

More Telugu News