కొత్త రికార్డును కొన్ని గంటల్లోనే సరిచేసిన టీమిండియా స్పిన్నర్ అశ్విన్!
- యాషెస్‌లో నాథన్ లియాన్, ఢిల్లీ టెస్టులో అశ్విన్ రికార్డులు
- ఈ ఏడాది 54 వికెట్లతో అశ్విన్ సరికొత్త రికార్డు
- ఐదో స్థానంలో రవీంద్ర జడేజా
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ విజృంభించి ఏంజెలో మాథ్యూస్, రోషన్ సిల్వా, నిరోషన్ డిక్‌వెల్లా వికెట్లను పడగొట్టిన అశ్విన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 55 వికెట్లు పడగొట్టి నాథన్ లియన్ సరసన చేరాడు.
లియాన్ ఈ ఘనత సాధించేందుకు 9 టెస్టులు ఆడగా, అశ్విన్ 11 మ్యాచుల్లోనే ఈ మైలు రాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 54 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ 51 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా రవీంద్ర జడేజ ఐదో స్థానంలో ఉన్నాడు.