మరోసారి తెరమీదకి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ వివాదం.. ప్రభుత్వం సాయం చేస్తే ఫోన్లు డెలివరీ చేస్తానని ప్రకటన
- ఇద్దరు వ్యక్తుల చేతిలో మోసపోయిన మోహిత్ గోయల్
- వారిపై కేసు పెట్టిన మోహిత్
- అరెస్టు చేసిన పోలీసులు
వివాదానికి అసలు కారకులెవరో ఇప్పుడు ప్రజలకు అర్థమైందని, వారి గురించి తెలియక పంపిణీదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాను ఆర్నెల్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, ప్రభుత్వం సహకరిస్తే మార్చి-ఏప్రిల్ లోగా ఫోన్లు సరఫరా చేస్తానని మోహిత్ తెలిపారు. ప్రస్తుతం తన ఐడియా కాపీ కొట్టి జియో, కార్బన్ కంపెనీలు తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్లను తయారుచేస్తున్నాయని ఆరోపించారు. తన ఐడియా `మేకిన్ ఇండియా`కు ప్రోద్బలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తనకెలాంటి సాయం చేయలేదని మోహిత్ వెల్లడించారు.