శైలజపై దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలి: నన్నపనేని
- చిత్తూరు జిల్లా మోతరంగనపల్లిలో భార్యపై దారుణానికి పాల్పడ్డ భర్త
- బాధితురాలు శైలజను పరామర్శించిన నన్నపనేని
- ఘటన వివరాల సేకరణ
- ఈ ఘటనపై రాష్ట్ర సర్కారుకి నివేదిక ఇస్తాం
ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ.. శైలజ భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తాము రాష్ట్ర సర్కారుకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. శైలజకు అండగా ఉంటామని ప్రకటించారు.