పార్లమెంట్ చ‌ర్చ మ‌ధ్య‌లో స్వ‌లింగ‌ భాగ‌స్వామికి ప్ర‌పోజ్ చేసిన ఆస్ట్రేలియన్ చ‌ట్ట‌స‌భ్యుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంట్ చ‌ర్చ మ‌ధ్య‌లో స్వ‌లింగ‌ భాగ‌స్వామికి ప్ర‌పోజ్ చేసిన ఆస్ట్రేలియన్ చ‌ట్ట‌స‌భ్యుడు!

  • స్వ‌లింగ వివాహాల గుర్తింపు బిల్లుపై చ‌ర్చ‌
  • త్వ‌ర‌లో చ‌ట్ట‌బ‌ద్ధం కానున్న స్వ‌లింగ వివాహాలు
  • చ‌ట్ట‌స‌భ్యుడి ప్ర‌పోజ‌ల్‌ని అంగీక‌రించిన భాగ‌స్వామి
ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌లో ఓ అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇటీవ‌ల స్వ‌లింగ వివాహాలను చ‌ట్ట‌బ‌ద్ధం చేస్తూ స‌భ్యులు అక్క‌డ‌ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఈ బిల్లు చ‌ట్ట‌రూపం కూడా దాల్చ‌నుంది. అయితే ఈ బిల్లుపై చ‌ర్చిస్తూ చ‌ట్ట‌స‌భ్యుడు టిమ్ విల్స‌న్‌, త‌న స్వ‌లింగ భాగ‌స్వామి, స్కూల్ టీచర్ అయిన రాయ‌న్ బోల్జ‌ర్‌కి ప్ర‌పోజ్ చేశారు. గ్యాలరీలో వుండి ఈ చర్చను వీక్షిస్తున్న బోల్జ‌ర్ వెంట‌నే 'ఎస్' అంటూ దానికి అంగీకారం తెలిపాడు.

గ‌త ఏడేళ్లుగా వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. కానీ అక్క‌డ స్వ‌లింగ వివాహాల‌పై నిషేధం ఉండ‌టం కార‌ణంగా పెళ్లి చేసుకోలేక పోయారు. త్వ‌ర‌లో ఆ నిషేధం ఎత్తివేయ‌నున్న నేపథ్యంలో టిమ్ ప్ర‌పోజ్ చేశారు. అత‌ను మాట్లాడుతున్న‌పుడు కొంత ఉద్వేగానికి గుర‌య్యాడు. కానీ బోల్జ‌ర్ అంగీక‌రించ‌గానే ఆనందం వ్య‌క్తం చేశాడు. దీంతో అక్క‌డున్న ఇత‌ర చ‌ట్ట‌స‌భ్యులు చ‌ప్ప‌ట్లు కొట్టి, వారిద్ద‌రినీ అభినందించారు.

Australia
house of representatives
tim wilson
ryan bolger

More Telugu News