యూపీ స్థానిక సంస్థల ఎన్నికలు: అమేథీలో రాహుల్ గాంధీకి షాక్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీ స్థానిక సంస్థల ఎన్నికలు: అమేథీలో రాహుల్ గాంధీకి షాక్‌!

  • యూపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు
  • అమేథీ నగర పంచాయతిలో బీజేపీ విజ‌య దుందుభి
  • అయోధ్య పుర‌పాల‌క సంఘం బీజేపీ కైవ‌సం
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ నియోజ‌క‌వ‌ర్గం అమేథిలో ఆయ‌న‌కు షాక్ త‌గిలింది. అమేథీ నగర్ పంచాయతిలో బీజేపీ విజ‌య దుందుభి మోగించింది. అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయ్‌ బరేలీలోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది.

కాగా, అయోధ్య పుర‌పాల‌క సంఘాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ కైవ‌సం చేసుకుంది. అయోధ్య‌లోని మొత్తం 60 వార్డుల్లో బీజేపీ 32, ఎస్పీ 17, బీఎస్పీ 2, కాంగ్రెస్ 1, ఇత‌రులు 8 మంది విజ‌యం సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మేయర్ స్థానాలను, నగర పంచాయతిలను బీజేపీనే కైవసం చేసుకుంది.
rahul gandhi
amethi
election

More Telugu News