YSRCP: కాళ్లకు బొబ్బలెక్కినా కొనసాగుతున్న జగన్ పాదయాత్ర... గాయాల ఫోటోలివి!

షార్ట్స్‌లో చూడండి
దాదాపు మూడు వారాలకు పైగా అలుపెరగకుండా 'ప్రజాసంకల్ప యాత్ర' పేరిట పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కాళ్లకు బొబ్బలు రాగా, విశ్రాంతి తీసుకోకుండా ఆయన పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. నేడు 23వ రోజుకు యాత్ర చేరుకోగా బిల్లేకల్లు నుంచి ఆయన యాత్ర ప్రారంభమైంది.

ఇక జగన్ కాళ్లకు బొబ్బలైన దృశ్యాలను వైకాపా మహిళా నేత రోజా, తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంటూ, "కాళ్లకు గాయాలయినా, భరిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జననేతా మీకు పాదాభివందనం!!" అని పోస్టు పెట్టారు. కాగా, జగన్ గాయాల గురించి తెలుసుకున్న ఆయన సతీమణి వైఎస్ భారతి, పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి స్వయంగా వచ్చి , భర్త క్షేమసమాచారాలు తెలుసుకున్న సంగతి విదితమే. ఇప్పటివరకూ జగన్ పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలురాయిని దాటి సాగుతోంది. జగన్ కాళ్లకు గాయాలైన దృశ్యాలను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
YSRCP
Prajasankalpa yatra
Jagan
roja

More Telugu News