పక్కింటి వ్యక్తితో భార్య అక్రమ సంబంధం... అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపిన జవాను!
Add ap7am to your home Screen

పక్కింటి వ్యక్తితో భార్య అక్రమ సంబంధం... అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపిన జవాను!

  • సీఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్న సురేందర్
  • రాత్రి ఇంటికి రాగా, ఆరుబయట పక్కింటి రాజేష్
  • అనుమానంతో భార్యను, రాజేష్ దంపతులను కాల్చిచంపిన సురేందర్
తన భార్య పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఓ జవాను అనుమానం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీప వాసి సురేందర్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాను. అతని భార్య లావణ్య. జమ్మూ కశ్మీర్ లోని దులాస్టిలోని నేనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసే సురేందర్, భార్య లావణ్యతో సహా అక్కడే కాపురం ఉంటుండగా, వారికి ఇద్దరు పిల్లలు.

గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చిన సురేందర్, పక్కింటి వ్యక్తి రాజేష్ బయట ఉండటాన్ని చూశాడు. తన భార్య రాజేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో, రాజేష్ ను, లావణ్యను కాల్చి చంపాడు. తుపాకి శబ్దానికి బయటకు వచ్చిన రాజేష్ భార్య శోభనూ హత్య చేశాడు. ఈ ఘటనతో రెండు జంటల పిల్లలూ అనాధలుగా మారగా, వారి బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపిన సీఐఎస్ఎఫ్ అధికారులు, సురేందర్ ను సస్పెండ్ చేశారు. తమ కుమారుడి అనుమానానికి ఆవేశం తోడై, వృద్ధాప్యంలో తమకు శోకాన్ని మిగిల్చిందని సురేందర్ తల్లిదండ్రులు వాపోయారు.
CISF Jawan
Murder
Jammu and Kashmir

More Telugu News