DDA: రెండున్నరేళ్లుగా నరకం చూపిస్తున్నారు... ఇప్పుడు చంపుతామంటున్నారు: ఢిల్లీ మహిళా ఉద్యోగి ఆవేదన

  • డీడీఏలో భర్త ఉద్యోగం పొందిన మహిళ
  • రెండున్నరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న సీనియర్ అధికారి, సహోద్యోగులు
  • వీడియో తీసి బ్లాక్ మెయిల్

రెండున్నరేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతూ నకరం చూపుతున్న దుర్మార్గులు ఇప్పుడు చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఢిల్లీ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (డీడీఏ) లో పనిచేస్తున్న బాధిత ఉద్యోగిని ఆందోళన వ్యక్తం చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... డీడీఏలో ఉద్యోగం చేస్తున్న బాధిత మహిళ భర్త 2014లో ప్రమాదవశాత్తు మృతిచెందారు. దీంతో ఆయన ఉద్యోగం ఆయన భార్యకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆమెపై సీనియర్‌ అధికారి సహా నలుగురు సహోద్యోగులు అత్యాచారానికి పాల్పడుతున్నారు.

 ఈ దారుణాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగుతూ నరకం చూపిస్తున్నారని ఆమె తెలిపింది. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా వేధింపులకు దిగడంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీడియోను చూపుతూ బ్లాక్ మెయిల్ కు దిగుతూ, ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే హతమారుస్తామని బెదిరింపులకు దిగారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోందని డీసీపీ రొమిల్ బనియా తెలిపారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. 

More Telugu News