కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో మద్యపానం... 22 మంది విద్యార్థుల సస్పెన్షన్
- పుట్టిన రోజు పేరుతో ఫుల్‌గా తాగిన విద్యార్థులు
- క్యాంపస్‌లో డ్రగ్స్?
- ఖండించిన యాజమాన్యం
అయితే ఈ పార్టీలో విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎలాంటి నిజం లేదని కాలేజీ యాజమాన్యం ఖండించింది. పుట్టినరోజు జరుపుకున్న విద్యార్థి గదిని తాను స్వయంగా సందర్శించానని, అక్కడ గంజాయి వాడినట్లుగానీ, దాచినట్లుగానీ ఆనవాళ్లు కనిపించలేదని చంద్రశేఖర్ అన్నారు. విద్యార్థులు కేవలం మద్యం మత్తులో అల్లరి చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో స్థానిక ఎన్ఐటీ విద్యార్థుల వద్ద డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో ఈ విషయం గురించి మరింత సమాచారం రాబట్టేందుకు కమిటీ వేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.