charan: చరణ్ మాట తప్పలేదు .. తమన్ కి ఛాన్స్ ఇచ్చాడు

షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా చిత్రపరిశ్రమలో మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండటం చాలా కష్టమైన విషయమేనని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నిర్ణయం ఎప్పుడూ కూడా ఒకరి చేతిలో ఉండదు. అయినా మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు అంటే .. అది గొప్ప విషయమేనని చెప్పాలి. ఇప్పుడు ఆ విషయంలోనే అంతా చరణ్ గురించి చెప్పుకుంటున్నారు.

 'సైరా' సినిమా టీజర్ ను అప్పటికప్పుడు సిద్ధం చేయవలసి రావడంతో, ఆ బాధ్యతను తమన్ సమర్థవంతంగా నిర్వహించాడు. ఆ టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ సినిమాకి నిర్మాత అయిన చరణ్ .. అందుకు తగిన పారితోషికం ఇవ్వడమే కాకుండా, తన తదుపరి సినిమాలో ఆయనకే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడట. అన్నట్టుగానే బోయపాటితో తాను చేయనున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కి ఛాన్స్ ఇచ్చాడు. చరణ్ మాట నిలబెట్టుకున్నాడంటూ ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.    
Go Back to Shorts
charan
thaman

More Telugu News