సెంచరీ మార్కు దాటిన టీమిండియా.. బౌలర్ల ఆటలు సాగనీయని పుజారా, విజయ్!
- రెండో రోజు ఆకట్టుకున్న టీమిండియా బ్యాట్స్ మన్
- రెండు సార్లు క్యాచ్ ప్రమాదం నుంచి బయటపడ్డ మురళీ విజయ్
- నింపాదిగా ఆడుతూ ఆకట్టుకుంటున్న విజయ్, పుజారా
ఈ క్రమంలో రెండు సార్లు మురళీ విజయ్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒకసారి బౌలర్ ఆలస్యంగా కదలడంతో క్యాచ్ మిస్ కాగా, రెండోసారి కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకున్న ఫీల్డర్ చేతి నుంచి చివరి క్షణంలో అది జారిపోవడంతో బతికి పోయాడు. దీంతో 47 ఓవర్లు ఆడిన టీమిండియా 104 పరుగులు చేసింది. క్రీజులో పుజారా, విజయ్ ఉన్నారు.